అనకాపల్లిలో ఈనెల 20 నుంచి మూడు రోజులపాటు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు తెలిపారు. నక్కపల్లి మండలం రాజయ్యపేటలో గురువారం గోడపత్రిక విడుదల చేశారు. దేశంలో నెలకొన్న ఆర్థిక సామాజిక అంతరాలు, కులమత ప్రాంతీయ భాషాద్వేషాలపై అవగాహన కల్పిస్తామన్నారు. అలాగే, మత్స్యకారుల సమస్యలపై చర్చిస్తామన్నారు.
వార్తలు
ఈనెల 20 నుంచి శిక్షణ తరగతులు


