హైదరాబాద్: 28°C
వార్తలు

40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని పర్యటన

ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఈనెల 10, 11 తేదీల్లో న్యూజిలాండ్‌లో పర్యటించనున్నారు. గత 40 ఏళ్లలో భారత ప్రధాని అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆక్లాండ్‌లో జరిగే ఈ భేటీలో వాణిజ్యం, రక్షణ, పరస్పర సహకారంపై ఇరు దేశాల నేతలు చర్చించనున్నారు. అలాగే అక్కడి వ్యాపారవేత్తలు, క్రీడాకారులు, NRIలతో మోదీ ప్రత్యేకంగా సమావేశమై ప్రసంగించనున్నారు.