ఇ-20 పెట్రోలు వినియోగం వల్ల దేశంలో ఇప్పటివరకు ఎక్కడా ఇంజిన్ వైఫల్యం లేదా వాహనం ఆగిపోవడం లాంటి ఒక్క సంఘటన కూడా నమోదు కాలేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. చమురు కంపెనీలు, వాహన తయారీదార్లు, ఇంధన పరీక్షా సంస్థల నిరంతర పర్యవేక్షణలోనే ఈ మిశ్రమ కార్యక్రమం సాగుతోందని తెలిపింది. ఊహాగానాలు, తప్పుడు సమాచారం వల్లే ఆందోళనలు రేగుతున్నాయని పేర్కొంది.
వార్తలు
ఒక్క కారు, బైక్ కూడా ఆగిపోలేదు: కేంద్రం


