హైదరాబాద్: 28°C
వార్తలు

మెల్‌బోర్న్ సభలో మోదీ ఊరమాస్ చమత్కారం

ఆస్ట్రేలియా దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో ప్రవాస భారతీయులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన ఓ ఆసక్తికరమైన ఉదాహరణను చెప్తూ.. 'ఇక్కడ పాలు ఆస్ట్రేలియావైనా.. దాంతో తయారయ్యేది మాత్రం మన భారతీయతతో కూడిన చాయ్ (టీ)' అంటూ చమత్కరించారు. మనవారంతా ఆస్ట్రేలియా ప్రగతిలో భాగస్వాములవుతూనే మన సంస్కృతిని కాపాడుతున్నారని కొనియాడారు.