ప్రకాశం: మర్రిపూడి ప్రభుత్వ వైద్యశాలలో గురువారం పురిటి నొప్పులతో వచ్చిన మౌనిక అనే మహిళకు డాక్టర్ వీరబాబు సాధారణ కాన్పు చేశారు. గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మౌనికను మండల పరిధిలోని అంకేపల్లిలో పురిటి నొప్పులు ప్రారంభం కావడంతో వైద్యశాలలో చేర్చారు. ఉదయం 11.24 నిమిషాలకు ఓ బేబీ జన్మించింది. పేషెంట్ బంధువులు డాక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
వైద్యశాలలో సాధారణ కాన్పు చేసిన డాక్టర్


