KRNL: ఐసీడీఎస్‌కు 50 ఏళ్లు పూర్తైనా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు రూ.26 వేల కనీస వేతనం, గ్రాట్యుటీ, పెన్షన్ వంటి హక్కులు అమలు చేయకపోవడం అన్యాయమని ఎమ్మిగనూరులో సీఐటీయూ నాయకులు విమర్శించారు. అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జూలై 10న కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే మహాధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
వార్తలు
'అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలి'


