హైదరాబాద్: 28°C
వార్తలు

నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని ధర్నా

ATP: గుంతకల్లులో ఇటీవల కురిసిన గాలివాన బీభత్సానికి నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను మార్చాలని కోరుతూ గురువారం విద్యుత్ కార్యాలయం ఎదురుగా సిపిఎం నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు మాట్లాడుతూ.. పట్టణంలో విద్యుత్ స్తంభాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయన్నారు. వాటిని తొలగించి నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలన్నారు.