హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన

KNR: మల్లన్నపల్లి గ్రామంలో గురువారం జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకం ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్త మధుకర్ రావు మాట్లాడుతూ సేంద్రీయ వ్యవసాయంలో జీవ ఎరువుల ప్రాధాన్యత, వివిధ రకాల కషాయాల తయారీ విధానాలను వివరించారు. ద్రవ జీవామృతం, ఘన జీవామృతం, పురుగు నివారణకు ఉపయోగించే నీమాస్త్రం, పై అవగాహన కల్పించారు.