ఇ-20 పెట్రోలు(80% పెట్రోలు+20% ఇథనాల్) వాడితే వాహన ఇంజిన్లు పాడవుతాయని, బీమా వర్తించదంటూ వస్తున్న వార్తలను ఇండియన్ షుగర్ అండ్ బయో-ఎనర్జీ మ్యాన్‌ఫ్యాక్చరర్స్ అసోసియేషన్(ISMA) ఖండించింది. ఈ ప్రచారాలు పూర్తిగా తప్పుదోవ పట్టించేవేనని తెలిపింది. పెట్రోల్‌లో నేరుగా చెరుకు రసం కలుపుతారనే ప్రచారంలో నిజం లేదని, శాస్త్రీయ పరీక్షల అనంతరమే ఇంధనం సరఫరా అవుతుందని తెలిపింది.
వార్తలు
ఇ-20 పెట్రోలుతో ఇంజిన్లు పాడవవు: ISMA


