MDK: జిల్లా కేంద్రంలో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో సర్ధన జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. అండర్-14 ట్రైయథలాన్ బాలుర విభాగంలో జి.అభినవ్ యాదవ్ ప్రథమ, పి.రిత్విక్ ద్వితీయ స్థానాలు సాధించారు. వీరు ఈనెల 17, 18 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ప్రతిభ చూపిన విద్యార్థులను పీడీ సత్యనారాయణ ఘనంగా అభినందించారు.
వార్తలు
అథ్లెటిక్స్ పోటీల్లో సర్ధన విద్యార్థుల సత్తా


