MDK: పెద్దశంకరంపేట మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో క్రాంతికుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్లు, వనమహోత్సవం మొక్కల నాటడంపై చర్చించారు. గ్రామాల్లో నాలుగు రకాల చెత్త సేకరణ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను ఆదేశించారు.
వార్తలు
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: ఎంపీడీవో


