హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: గిరిజన మహిళకు అండగా వైసీపీ

NLR: వైసీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత కావలి పట్టణంలోని 24వ వార్డు కచేరిమిట్టలో ఇటీవల దాడికి గురైన గిరిజన మహిళను పరామర్శించారు. బాధితురాలిని కలిసి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకుని, ఆమెకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఓ గిరిజన మహిళపై జరిగిన దాడి అత్యంత అమానుషమన్నారు.