హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: అధ్వానంగా మట్టి రోడ్లు.. ప్రజలకు ఇబ్బందులు

MLG: మంగపేట మండలంలోని పలు గ్రామాల అంతర్గత మట్టి రోడ్లు వర్షాలకు బురదమయంగా మారి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. స్వల్ప వర్షానికే నీరు నిలిచిపోవడంతో కాలినడకన వెళ్లేవారు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిల్వ నీటితో దోమలు, ఈగలు పెరిగి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.