హైదరాబాద్: 28°C
వార్తలు

యథావిధిగా ములాఖత్ సమయాలు

​విశాఖ కేంద్ర కారాగారంలో ఖైదీల ములాఖత్ సమయాలను తిరిగి యథావిధిగా పునరుద్ధరించినట్లు జైల్ సూపరిండెండెంట్ మహేష్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా గత కొన్ని నెలలుగా ఈ సమయాలను తగ్గించారు. ఎండలు తగ్గడంతో తాత్కాలిక నిబంధనలను రద్దు చేశారన్నారు. ఇకపై బంధువులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఖైదీలను కలవచ్చని ఆయన పేర్కొన్నారు.