రాజస్థాన్ జైపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతల్లినే 23 ఏళ్ల కూతురు కడతేర్చింది. ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఆ యువతి ఏకంగా రూ.7 లక్షల సుపారీ ఇచ్చింది. తల్లిని సుపారీ గ్యాంగ్ కారుతో ఢీ కొట్టగా ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో కుమార్తెను పోలీసులు అరెస్ట్ చేశారు.
వార్తలు
ఉద్యోగం కోసం తల్లిని చంపిన కుమార్తె


