హైదరాబాద్: 28°C
వార్తలు

కార్మికుల విశ్రాంతి నిలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కోనసీమ: ఆటో కార్మిక రంగంలో పని చేసే కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. గురువారం మండపేట బస్టాండ్ వద్ద నిర్మించిన ఆటో కార్మికుల విశ్రాంతి నిలయంను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎండనక, వాననక ప్రజలను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చే ఆటో కార్మికుల సేవలు ఎంతో అభినందనీయమని కొనియాడారు.