మహారాష్ట్రలో కురుస్తున్న కుంభవృష్టి వర్షాలకు ముంబై - పుణే జాతీయ రహదారి పూర్తిగా జలమయమైంది. వర్షపు నీరు రోడ్డుపై భారీగా చేరింది. దీంతో హైవే కాస్తా నదిని తలపిస్తోంది. మోకాళ్ల లోతు నీటిలో వాహనాలు ముందుకు కదులుతున్నాయి. నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉన్నచోట్ల వాహనాలు మునిగిపోతుండటంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
వార్తలు
నదిలా మారిన ముంబై - పుణే హైవే


