హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: హాస్టల్‌ను పరిశీలించిన అదనపు డీఆర్‌డీవో

NGKL: తిమ్మాజిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల హాస్టల్‌ను జిల్లా అదనపు డీఆర్‌డీవో రాజేశ్వరి గురువారం సందర్శించారు. వసతి గృహ నిర్వహణ తీరు, రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడి భోజన వసతులపై అడిగి తెలుసుకున్నారు. మెనూ పాటిస్తూ నాణ్యమైన ఆహారం అందించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.