హైదరాబాద్: 28°C
వార్తలు

కుక్కల బెడద సమస్యలు తీర్చిన మున్సిపల్ అధికారులు

ATP: గుంతకల్లు మున్సిపాలిటీ‌లోని పలు వార్డులలో గురువారం వీధి కుక్కలను మున్సిపల్ అధికారులు పట్టి ఇతర ప్రాంతాలకు తరలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి మాట్లాడుతూ కుక్కల బెడద ఎక్కువ ఉందని ప్రజల నుంచి ఫిర్యాదు రావడంతో వీధి కుక్కలను పట్టి ఇతర ప్రాంతాలకి తరలిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ రవి, సిబ్బంది పాల్గొన్నారు.