ఇథనాల్ పెట్రోల్‌తో తన కుటుంబం విపరీతంగా లాభపడుతోందని వస్తున్న విమర్శలపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. అవి నిరాధార ఆరోపణలు అని కొట్టిపారేశారు. దేశంలో సుమారు 550 ఇథనాల్ ఉత్పత్తి యూనిట్లు ఉండగా.. అందులో తన వాటా కేవలం 0.07 శాతం అని చెప్పారు. ఇందులో తనకి గానీ, తన కుటుంబానికి గానీ ఎలాంటి ఉపయోగం జరగదని స్పష్టం చేశారు. ఈ పెట్రోల్ వల్ల రైతులకు మేలు జరుగుతుందన్నారు.
వార్తలు
నా కుటుంబానికి పైసా లాభం లేదు: గడ్కరీ


