హైదరాబాద్: 28°C
వార్తలు

హాకా రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

RR: కొందుర్గు మండలం ముట్పూర్‌లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 'హాకా' రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. రైతుల కోసం నాణ్యమైన విత్తనాలు, ఎరువులను నేరుగా అందించడంతో పాటు, పంటలను ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలు చేయడం, వ్యవసాయ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా విక్రయించేలా మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశ్యమన్నారు.