హైదరాబాద్: 28°C
వార్తలు

గేదెలను ఢీకొట్టిన కారు

NLR: పొదలకూరు మండలం వనం తోపు సమీపంలో గురువారం తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. అల్లూరు నుంచి ఆదూరుపల్లికి వెళ్తున్న కారు మార్గమధ్యంలో గేదెలను ఢీకొని అదుపుతప్పి పక్కనే ఉన్న పంట కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.