హైదరాబాద్: 28°C
వార్తలు

ఇస్రో గగన్‌యాన్ పారాచూట్ టెస్ట్ సక్సెస్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో ఘనత సాధించింది. తొలి మానవ అంతరిక్ష యాత్ర 'గగన్‌యాన్' కోసం రూపొందించిన ప్రధాన పారాచూట్ వ్యవస్థను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. మధ్యప్రదేశ్‌లో ఐఎల్‌-76 విమానం ద్వారా 2.5 కి.మీ ఎత్తు నుంచి జరిగిన ఈ ఎయిర్‌డ్రాప్ టెస్ట్‌లో పారాచూట్లు సమర్థంగా పనిచేసి డమ్మీ బరువు వేగాన్ని సురక్షితంగా తగ్గించాయి.