హైదరాబాద్: 28°C
వార్తలు

చౌటుప్పల్‌లో విద్యార్థి నాయకుల ఎన్నికలు

BHNG: చౌటుప్పల్ పట్టణంలోని ట్రినిటీ హైస్కూల్‌లో హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ఎన్నికలు గురువారం ఉత్సాహంగా జరిగాయి. విద్యార్థులు క్రమశిక్షణతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫలితాల్లో మెయిన్ క్యాంపస్ హెడ్ బాయ్‌గా బీ. పవన్ కుమార్, హెడ్ గర్ల్‌గా సీహెచ్. మనస్విని, ఐఐటీ క్యాంపస్ హెడ్ బాయ్‌గా ఎన్. సాయి నిఖిల్, హెడ్ గర్ల్‌గా జీ. హర్షిత విజయం సాధించారు.