హైదరాబాద్: 28°C
వార్తలు

ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి

కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. ధార్వాడ నుంచి తెల్లవారుజామున 9 మంది పర్యాటకులు వాహనంలో అంకోలా బయల్దేరారు. ఉత్తర కర్ణాటక జిల్లా ఎల్లాపుర పట్టణ శివారులోకి రాగానే వారు ప్రయాణిస్తున్న జీపు అదుపు తప్పి వేగంగా వెళ్లి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.