ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలమవుతోన్న మహారాష్ట్రను భూకంపం వణికించింది. మరాఠ్వాడ, నాందేడ్, హింగోలి, పర్భణీ ప్రాంతాల్లో ఇవాళ తెల్లవారుజామున భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. హింగోలి జిల్లాలోని జామ్‌గిరి గ్రామంలో 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
వార్తలు
మహారాష్ట్రలో భూకంపం


