మహారాష్ట్ర పూణే జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం తంహిని ఘాట్‌లో సరికొత్త రికార్డు వర్షపాతం నమోదైంది. కేవలం 72 గంటల్లో ఏకంగా 1,635 మి.మీ భారీ వర్షం నమోదైనట్లు అధికారులు తెలిపారు. 3 రోజుల్లో ప్రతిరోజూ 500 మి.మీటర్లకు పైగా కుండపోత వర్షం కురిసిందని చెప్పారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందిన ఈ 15 కి.మీ ఘాట్ రోడ్డులో జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి.
వార్తలు
72 గంటలు.. 1,635 మి.మీ వర్షం


