హైదరాబాద్: 28°C
వార్తలు

ఆసుపత్రులపై ఆరోపణలు.. సీఎం తనిఖీలు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవినీతి, అపరిశుభ్రతపై వస్తున్న ఫిర్యాధులపై స్వయంగా తమిళనాడు సీఎం విజయ్ రంగంలోకి దిగారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా చెన్నై ఎగ్మూర్ పిల్లల ఆసుపత్రిని తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న సౌకర్యాలపై వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తర్వాత రోగులను, కుటుంబ సభ్యులను కలిసి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం చిన్నారులను ఎత్తుకుని ముద్దాడారు.