హైదరాబాద్: 28°C
వార్తలు

నారు వేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి: వ్యవసాయ అధికారి

PDPL:పాలకుర్తి మండలం రాణాపూర్లో రైతులు వరి నాట్లు వేసే పొలాల వద్దకు మండల వ్యవసాయ అధికారి బండి ప్రమోద్ వెళ్లి వరి నారు వేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి రైతులకు అవగాహన కల్పించారు. నాటిన తర్వాత కాండం తొలిచే పురుగులు, సాగు విధానాలపై రైతులకు వివరించారు. వర్షాభావ పరిస్థితులలో తీసుకోవాల్సిన చర్యల గురించి తెలిపారు. రైతుల సందేహాలను నివృత్తి చేశారు.