హైదరాబాద్: 28°C
వార్తలు

వరదలో కొట్టుకుపోయిన గ్యాస్ సిలిండర్లు

మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో భారీ వర్షాలకు వరదలు తీవ్రరూపం దాల్చాయి. దీంతో చవానే గ్రామంలో HPCL గ్యాస్ సిలిండర్ల గోదాం నీట మునిగిపోయింది. దీంతో వందలాది ఖాళీ గ్యాస్ సిలిండర్లు ఆకస్మిక వరదలో కొట్టుకుపోయాయి. ప్రాసెసింగ్, రీఫిల్లింగ్ కోసం ప్లాంట్‌కు తీసుకొచ్చిన ఈ ఖాళీ సిలిండర్లు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయి ఓ దగ్గరకు చేరాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.