హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యుత్ ఉపకేంద్రాన్ని పరిశీలించిన SE

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని సూపరింటెండింగ్ ఇంజనీర్ టి. వేణుమాధవ్ నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపకేంద్రంలోని విద్యుత్ పరికరాల పనితీరు, నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, విద్యుత్ సరఫరా పరిస్థితులను ఆయన సమీక్షించారు. వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందేలా నిర్వహణ పనులను సకాలంలో చేపట్టాలన్నారు.