TG: గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఇవాళ హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన IDOCలో ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల స్టాల్స్‌ను సందర్శిస్తారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఆ తర్వాత IDOC నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు నిర్వహించే 'నషా ముక్త్ భారత్' ర్యాలీని ఆయన ప్రారంభిస్తారు. అలాగే, రెడ్ క్రాస్‌ను సందర్శించనున్నారు.
వార్తలు
నేడు వరంగల్‌లో గవర్నర్ పర్యటన


