హైదరాబాద్: 28°C
వార్తలు

వైభవంగా శ్రీరంగనాథ స్వామి తిరుకళ్యాణోత్సవం

WNP: శ్రీరంగపురం మండలంలోని శ్రీరంగనాథ స్వామి ఆలయంలో రేవతి నక్షత్రం సందర్భంగా బుధవారం రాత్రి స్వామి, అమ్మవార్లకు తిరుకళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు విష్ణునారాయణ ఆధ్వర్యంలో నిత్య పూజలు, అలంకరణలు చేశారు. ఈ వేడుకలో వివిధ గ్రామాలకు చెందిన భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.