హైదరాబాద్: 28°C
వార్తలు

మోడల్ స్కూల్‌లో పీజీటీ ఇంగ్లీష్ పోస్టుల భర్తీ

NRPT: గుండుమాల్ మండలంలోని మోడల్ స్కూల్, కళాశాలలో ఖాళీగా ఉన్న పీజీటీ ఇంగ్లీష్ అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఉమై అశ్రా తెలిపారు. ఇంగ్లీష్‌లో పీజీ, బీఈడీ అర్హత ఉన్న అభ్యర్థులు రేపు నిర్వహించే డెమో ఇంటర్వ్యూకు ధ్రువపత్రాలతో హాజరుకావాలని ఆమె సూచించారు. నిరుద్యోగులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.