హైదరాబాద్: 28°C
వార్తలు

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వేదికగా తెలంగాణ

TG: 2026లో 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఆతిథ్య హక్కులు తెలంగాణకు దక్కడంపై మంత్రి వాకిటి శ్రీహరి హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్రీడల అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యత వల్లే ఈ అవకాశం దక్కిందన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియాకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో ఈ క్రీడలను విజయవంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు.