హైదరాబాద్: 28°C
వార్తలు

'ధాన్యం కొనుగోల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది'

TG: రాష్ట్రంలో 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలుకు కేంద్రం అనుమతిచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం సేకరణలో విఫలమైందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం ఢిల్లీలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిని కలసి ఆయన వినతిపత్రం ఇచ్చారు. గన్నీ బ్యాగులు, గోదాములు లేక రైతులు రోడ్లపైకి వస్తున్నారని, కనీసం 13 శాతం ధాన్యం కూడా ఎఫ్‌సీఐకి అప్పగించలేదని మండిపడ్డారు.