హైదరాబాద్: 28°C
వార్తలు

రేవంత్ సమావేశం.. హాజరైన కొండా సురేఖ

TG: యాదగిరిగుట్ట కొత్త పాలకమండలితో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి మంత్రి కొండా సురేఖ హాజరుకావడంతో.. పాలకమండలి నిర్ణయంపై ఆమె అసంతృప్తితో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న పుకార్లకు చెక్ పడింది. ప్రభుత్వ నిర్ణయాలకు, కొత్త కమిటీకి మంత్రి సురేఖ పూర్తి మద్దతుగా ఉన్నట్లు ఈ సమావేశం ద్వారా స్పష్టమైంది.