హైదరాబాద్: 28°C
వార్తలు

NHM ఉద్యోగాలు.. ఇంటర్వ్యూల తేదీల్లో మార్పులు

AP: జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) పరిధిలో 13 ఎపిడెమియాలజిస్టు పోస్టుల వాక్-ఇన్ ఇంటర్వ్యూల తేదీని MSRB మార్చింది. ప్రభుత్వ మెమో ప్రకారం.. గతంలో ఈనెల 13న జరగాల్సిన ఇంటర్వ్యూలను ఈనెల 11వ తేదీకి ముందుకు తీసుకొచ్చారు. అభ్యర్థులు 11న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల లోపు మంగళగిరిలోని MSRB కార్యాలయంలో ఇంటర్వ్యూకు హాజరుకావాలని బోర్డు సూచించింది.