మహారాష్ట్రలో డాక్టర్, వైద్య సిబ్బందిపై దాడి చేసిన శివసేన కార్పొరేటర్ రమేష్ మహాత్రేను, ఆయన అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. జూలై 6న డోంబివ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్స్ ఖాళీ లేవని మరో ఆసుపత్రికి వెళ్లమన్నందుకు డాక్టర్ సృష్టి బావిస్కార్‌పై ఆయన దాడి చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో బుధవారం పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
వార్తలు
డాక్టర్‌పై దాడి.. శివసేన నేత అరెస్ట్


