యూపీ ఫతేపూర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఇంట్లో గొడవల నేపథ్యంలో ఓ భార్య భర్తను మంచానికి కట్టేసి దారుణంగా కొట్టింది. అంతేకాకుండా శరీరానికి కరెంటు వైర్లు చుట్టి షాకులు ఇచ్చింది. రాత్రంతా అలాగే చేసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని భర్తను కాపాడి ఆసుపత్రికి తరలించి భార్యను అరెస్ట్ చేశారు. అయితే భర్త పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
వార్తలు
మంచానికి కట్టేసి కొట్టి.. షాకులు ఇచ్చి


