సమోసాలు (టిఫిన్) కొనుగోలు చేయడం కోసం లోకో పైలట్ ఏకంగా రైలును ఆపేశాడంటూ వస్తున్న వార్తలను పశ్చిమ రైల్వే తీవ్రంగా ఖండించింది. ఇండోర్ సమీపంలోని రావు యార్డ్‌లో ముందుగా నిర్ణయించిన ఇంజనీరింగ్ పనుల కారణంగా, సిగ్నల్ దొరక్క గూడ్స్ రైలును హోమ్ సిగ్నల్ వద్ద నిలిపివేశారని చెప్పింది. ఇది అధికారికంగా ఇచ్చిన విరామం అని ఆహారం కోసం ఉద్దేశపూర్వకంగా ఆపలేదని వెల్లడించింది.
వార్తలు
సమోసాల కోసం ఆగిన రైలు.. రైల్వే శాఖ క్లారిటీ


