హైదరాబాద్: 28°C
వార్తలు

సింగరేణికి కేంద్రం గుడ్ న్యూస్..!

KMM: కేంద్ర ప్రభుత్వం వేలం లేకుండా నేరుగా సింగరేణికి 'తాడిచర్ల-2' బొగ్గు బ్లాక్‌ను కేటాయించడం పట్ల ఖమ్మం సింగరేణి కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ కృషి వల్లే ఈ కేటాయింపు జరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల సింగరేణికి ఆర్థిక భారం తప్పడమే కాకుండా కొత్త ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.