హైదరాబాద్: 28°C
వార్తలు

వనపర్తిలో శివాజీ విగ్రహ ధ్వంసంపై ఆందోళన

వనపర్తిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ధ్వంసాన్ని ఖండిస్తూ నిర్వహించిన నిరసనలో బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ గజరాజుల తిరుమలేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, నూతన శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పునఃప్రతిష్ఠ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే వారికి పోలీసులకు వాగ్వాదం జరిగింది.