ATP: అరుదైన ప్రాణాపాయ వ్యాధితో బాధపడుతున్న ఉరవకొండకు చెందిన ఆరు నెలల చిన్నారి లోకేష్ వైద్యానికి సీఎం సహాయనిధి నుంచి రూ. 7.5 లక్షలు మంజూరయ్యాయి. బాధితులు ఇటీవల మంత్రి పయ్యావుల కేశవ్‌ను కలిసి ఆర్థిక సహాయం కోరారు. స్పందించిన మంత్రి హామీ ఇచ్చిన ఐదు రోజుల్లోనే నిధులు మంజూరు చేయించారు. అనంతపురంలోని తన స్వగృహంలో చిన్నారి తల్లికి చెక్కు అందజేశారు.
వార్తలు
ఐదు రోజుల్లోనే హామీ నెరవేర్చిన మంత్రి పయ్యావుల


