ఢిల్లీ రోహిణి ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నిర్మాణంలో ఉన్న నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
వార్తలు
కూలిన భవనం.. శిథిలాల కింద పలువురు


