హైదరాబాద్: 28°C
వార్తలు

'ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యం చేరాలి'

PDPL: గోదావరిఖని శారద నగర్ ప్రభుత్వ బాలికల కళాశాలలో రోడ్డు భద్రత‌పై అవగాహన సదస్సును బుధవారం నిర్వహించారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు విద్యార్థులతో మాట్లాడుతూ, మద్యం తాగి వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్‌ను ఉల్లంఘించరాదని, హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యం చేరాలన్నారు.