అయోధ్య విరాళాల చోరీ ఘటనపై కాంగ్రెస్ చేస్తోన్న ఆరోపణలను బీజేపీ ఎంపీ కంగనా ఖండించారు. దశాబ్దాలుగా రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్.. ఇప్పుడు అదే అంశంపై రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు. ఈ ద్వంద్వ వైఖరిని దేశమంతా గమనిస్తోందన్నారు. గతంలో ఆలయ నిధులను పథకాలకు మళ్లించిన కాంగ్రెస్.. ఇప్పుడు రామాలయం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని దుయ్యబట్టారు.
వార్తలు
కాంగ్రెస్‌పై కంగనా ఫైర్


