హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: మురుగు నీరుతో అవస్థలు

ప్రకాశం: మర్రిపూడి (మం) జువ్విగుంట పంచాయతీ కేజీ కండ్రికకు వెళ్లే ప్రధాన రహదారిలో మురుగు కాలువ అధ్వానంగా ఉంది. మురుగు నీరు రోడ్లపైకి చేరి దుర్వాసన వెదజల్లుతోంది. అధికారులకు చాలాసార్లు చెప్పినా స్పందించడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మురుగు కారణంగా దోమలు పెరిగి విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందని భయపడుతున్నారు. మురుగు తొలగించాలని కోరుతున్నారు.