హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: కాళేశ్వరం ఆలయంపై ఆరోపణలు అవాస్తవం

BHPL: కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు చేసిన ఆరోపణలు నిరాధారమని కాంగ్రెస్ నాయకులు అన్నారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. కాళేశ్వరం ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ధన్వాడలో పంపిణీ చేసిన సంచులు దేవాదాయ శాఖకు చెందినవి కావని తెలిపారు.