హైదరాబాద్: 28°C
వార్తలు

హెచ్ఐవీ నివారణపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

సత్యసాయి: జిల్లా కలెక్టరేట్ ఆవరణలో మొబైల్ వ్యాన్ హెచ్ఐవీ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. ఆసుపత్రికి వెళ్లలేని మారుమూల ప్రాంతాల ప్రజలు, కార్మికులకు వారి గ్రామాల వద్దకే వెళ్లి ఈ వాహనం ద్వారా ఉచిత పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. హెచ్ఐవీ నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.